ముదిరాజులకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ మాకు వద్దు

నవతెలంగాణ- చండూర్
తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని , బీఆర్ఎస్, ఒక్క ఓటు వెయ్యకుండా ఓడిద్దామని మునుగోడు నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేసిన ముదిరాజ్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులను కించపరిచిన సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించాలన్నరు. ఎమ్మెల్సీ సభాపతి బండ ప్రకాష్ ముదిరాజ్ రాష్ట్రంలో ముదిరాజులకు నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నట్లు, అన్నారని అందులో మునుగోడు నియోజకవర్గం నుండి నారబోయిన రవి ఉన్నాడని చెప్పడం జరిగిందన్నారు. మూడు శాతం ఉన్న వెలుము కులస్తులకు 11 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నియంతృత్వ ధోరణి అవలంబిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజులత కలిసి టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి, ఈ ఎన్నికల్లో కెసిఆర్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కోటయ్య గూడెం మాజీ సర్పంచ్ మేకల యాదయ్య, కస్తాల మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన ప్రేమ లతా సైదులు, చిలుముల రమేష్, తదితరులు పాల్గొన్నారు.ముదిరాజులకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ మాకు వద్దు

Spread the love