22,217 ఎన్నికల బాండ్లు జారీ చేశాం

– సుప్రీంకోర్టు కు తెలిపిన ఎస్బీఐ

నవతెలంగాణ ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల (Electoral bonds) వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను ఎస్బీఐ నిన్న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ) కి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బ్యాంకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది. ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్టు ఎస్బీఐ వెల్లడించింది.

కోర్టు ఆదేశాల మేరకు గత ఐదేండ్లలో మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం. మొత్తం 22, 217 బాండ్లకు గాను 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు ఎన్ క్యాష్ చేసుకున్నాయి. అయితే ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు? ఏ పార్టీలు ఎంత ఎన్ క్యాష్ చేసుకున్నాయి వంటి విషయాలు కూడా అందజేశామని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. మిగిలిన 187 బాండ్లను నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి జిమ్ చేసినట్టు ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఎస్బీఐ వెబ్ సైట్ లో బహిర్గతం చేయాల్సి ఉంది.

Spread the love