– గిట్టని వారు మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
– విలేకరుల సమావేశంలో లతీఫ్ షా దర్గా ముతవల్లిలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ షా ఉర్సు ఉత్సవాలను జరిపే హక్కు తమకే ఉందని సయ్యద్ హజరత్ లతీపుల్లాషా దర్గా ముతవల్లిలు సల్మాన్ ఖాద్రి, సమీవుల్లా ఖాద్రి లు తెలిపారు. మంగళవారం వారు దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం ఉర్సు ఉత్సవాలను వకుబోర్డ్ ఆ ధ్వర్యంలో చేస్తామంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయని అన్నారు. బోర్డు ఇప్పటివరకు తమకు ఎలాంటి ప్రకటన పంపలేదని నోటీసులు కూడా జారీ చేయలేదని అన్నారు. గత 400 సంవత్సరాల నుండి తమ పూర్వికులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. తమ వంశం ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలకు మంచి ఆదరణ ఇప్పటివరకు లభించిందని అన్నారు. తమను భయపెట్టడానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం కూడా తమ ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహించడానికి పోస్టర్లు ముదిరించినామని అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. భక్తులంతా కూడా ముతవల్లిలా ఆధ్వర్యంలోనే ఉర్సు ఉత్సవాలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ బోర్డు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగాలని కోరుకోవడం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దర్గా మూత వల్లీలు రషీద్ సాబ్, ఒబేదుల్లా ఖాద్రి లు పాల్గొన్నారు.