కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలి   

– నిరసన వ్యక్తం చేసిన సిఐటియు,ఏఐటీయూసీ 

– జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి బెక్కంటి సంపత్ పిలుపునిచ్చారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో  కార్మికులకు చేసింది ఏమి లేదన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలలో కారు చౌకగా అమ్ముతూన్నారని ఆరోపించారు.డిజిల్ ,పెట్రోల్ వంట గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలను పిడిస్తున్నారని అన్నారు. స్వాతంత్రం  దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు సహజ వనరులు కార్పొరేట్ల చేతుల్లో  ఉన్నాయని ఆరోపించారు. అధికారం లోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం నేడు ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే విధంగా పరిశ్రమలన్నిటిని మూసివేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను రద్దుపరిచి వాటి స్థానాలలో కార్మికులకు నష్టపరిచే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి పని భారం మరింత పెంచిందన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య,సమ్మయ్య, సదానందం మహేందర్, సంపత్,అనిల్, వెంకటేష్, అజయ్,వెంకటేశ్వర్లు, తిరుమల,నరసవ్వ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love