– వంగ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనీ, వారందరికీ రుణపడి ఉన్నామని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, సీసీఎల్‌ఏ యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం -డాక్టర్ ఆంజనేయ గౌడ్
రానున్న రోజుల్లో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్ ) ఆధ్వర్యంలో మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీడాకారులకు అత్యున్నత గౌరవాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు. ఈ వేడుకల్లో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు, కోచులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.