బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలి

We should work together to strengthen BRS–  మహారాష్ట్ర ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్‌ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీనీ బలోపేతం చేయటానికి ఐక్యంగా కృషి చేయాలని ఆ పార్టీ మహారాష్ట్ర ఇన్‌చార్జి కల్లకుంట్ల వంశీధర్‌ రావు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ కొంకణ విభాగం సమన్వయకర్త దిగంబర్‌ విశేసర్‌ సంస్మరణ సభను ముర్బాడ్‌ తాలుకా కుణిబి సమాజోన్నత మండలి హాలులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీధర్‌రావు మాట్లాడుతూ విశేసర్‌ గొప్ప దార్శనికుడనీ, ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా, ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. విశేసర్‌ కుటుంబానికి పార్టీ బాసటగా ఉంటుందని ప్రకటించారు.

Spread the love