కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారందరికీ అండగా ఉంటాం

– ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
– తన అనుచరులు దాదాపు 200 మందితో ఎమ్మెల్యే సమక్షంలో చేరిన బిలకంటి శేఖర్‌ రెడ్డి
– బీఆర్‌ఎస్‌ విధానాలు నచ్చకనే కాంగ్రెస్‌లో చేరిక
– గడచిన పదేండ్లలో ఆశించిన సంక్షేమ ఫలాలు అందలేదు
– నందివనపర్తిని అభివద్ధి చేయలేకపోయాను
– ఆయన చేరికతో మండలంలో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌
నవతెలంగాణ-యాచారం
కాంగ్రెస్‌ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అం డగా ఉంటామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హా మీ ఇచ్చారు. మంగళవారం యాచారం మండల పరిధి నంది వనపర్తి గ్రామానికి చెందిన సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు, బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మెన్‌ బిల కంటి చంద్రశేఖర్‌ రెడ్డి 200 మంది ఆయన అను చరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే రంగారెడ్డి వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి అమలు చేస్తున్న 6 గ్యారంటీల సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెసులో చేరినట్లు శేఖర్‌ రెడ్డి తెలిపారు. గడిచిన పదేళ్లలో సంక్షేమ ఫలాలు గ్రామంలో అందించలేకపో యా నని ఆవేదన వ్యక్తం చేశారు. యాచారం గులాబీ పార్టీలో కొంతమంది వ్యవహార శైలి నచ్చకపోవ డంతో పార్టీ మారినట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌ ఎస్‌ పాలనలో సంక్షేమం కుంటుపడిందని విమ ర్శించారు. ఏ ఒకరికీ డబుల్‌ బెడ్రూం ఇల్లు, దళిత బంధు, యువతకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీఆర్‌ఎస్‌ విఫలమయిందని మండ ిపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి అమలు చేస్తున్న 6 గ్యారంటీలను అర్హులైనపేద లందరికీ అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇ చ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి గులాబీ పార్టీ కతం అవుతుందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ బలోపేతానికి పార్టీ కార్యకర్త లు, నాయ కులు మరింత కషి చేయాలని ఆయన తెలిపారు. మండలంలో శేఖర్‌ రెడ్డి చేరికతో గులా బీ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని పలువురు అంటు న్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ డైరెక్ట ర్‌ మల్లారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు కొంగల జోగి రెడ్డి, గ్రామశాఖ బి అధ్యక్షుడు పంది సుధాకర్‌తో పాటు 200 మంది గులాబీ నా యకులు, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ మం డల అధ్యక్షుడు మస్కు నరసింహ, నాయకులు దేంది రాంరెడ్డి, ముత్యాల వెంకటరెడ్డి, అరవిందు నా యక్‌, గజ్జి రామకష్ణ, భాసాని బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love