నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కుటుంబానికి అండగా ఉంటాం అని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శుక్రవారం, బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ అన్వర్ మాతృమూర్తి ఇటీవలే మరణించగా అన్వర్ ఇంటికి వెళ్లి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల ప్రధాన కార్యదర్శి బండ బాల సిద్ధులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఆలేరు నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు భోలు, బాల్ రెడ్డి, సుంచు భాస్కర్, మైలారం నరసింహులు, సింగం విజయ్, మైలారం స్వామి, మైలారం మధు, బండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.