నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలలో గాలివాన ప్రభావం వల్ల నష్టపోయిన వారందరికీ అండగా ఉండి ఆదుకుంటామని ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పాపాయిపల్లి సండ్రగూడెం బాలాజీ నగర్ దుంపలగూడెం గ్రామాలలో గాలివానకు సర్వం కోల్పోయిన కుటుంబాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అదేరియా పడొద్దు అని చెప్పి మనో ధైర్యాన్ని కల్పించడం జరిగింది, వెంటనే రెవెన్యూ అధికారులను పిలిపించి బాధితులకి పునరావాసం కోసం తక్షణ సహాయం అందజేయాలని కోరారు,అదే విధంగా పూర్తిగా కోల్పోయిన ఇండ్ల స్థానంలో గృహలక్ష్మి పథకం ద్వారా బాధితులకు ఇండ్లు మంజూరు చేయిస్తామని అదేవిధంగా రెవెన్యూ అధికారులకు బాధితులకు త్వరలోనే నష్టపరిహారం అందే విధంగా చూడాలని సూచన చేశారు, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందిఇన్చార్జి మినిస్టర్ సత్యవతి రాథోడ్ దృష్టికి జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కలిసి మినిస్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రభుత్వం నుంచి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ హామీ ఇవ్వడం జరిగింది, ఇంటి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా కన్వీనర్, ప్రసార కార్యదర్శి లౌడియా గణేష్ లాల్, సీనియర్ నాయకులు గొల్లల నర్సిరెడ్డి,పాపయ్య పల్లె సర్పంచ్ రాకేష్, బాలాజీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాలోత్ గాంధీ, ఫణి కుమార్, సారయ్య, జె ప్రతాప్, సీనియర్ నాయకులు యన్ సమ్మక్క, బుచ్చిరెడ్డి, సాయిబాబా, పి వెంకటేశ్వరరావు, పోతురాజు యాదయ్య, తదితరులు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.