నిరుద్యోగులకు అండగా ఉంటాం…!

– 60 కి పైగా కంపెనీలు 5225 మంది ఉద్యోగాలు 
– యువతకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి అండగా ఉంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో  యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్  నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జాబ్ మేళ కోసం  8795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దాదాపు 60 కి పైగా జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు సైతం మెగా జాబ్ మేళా లో పాల్గొన్నాయన్నారు. విద్యార్హతలు , నైపుణ్యాలు కలిగిన  1,310  మంది నిరుద్యోగులకు
తక్షణమే ఆర్డర్ కాపీలు అందించమన్నారు. మరో 3,887 మందిని షార్ట్ లిస్ట్ తయారు చేశామని, ఆఫిస్ లలో పిలిచి స్కిల్స్ నేర్పించిన తరువాత ఉద్యోగ   అవకాశాలు కల్పించనున్నాన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష ,పరోక్షంగా 5,225 మంది నిరుద్యోగులు  మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పొందేలా చేపలు ,పాల ఉత్పత్తి, ఎనిమల్ హస్బండరి అభివృద్ధి చేసి మరింత ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ  ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలని ,ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రాధాన్యత గా భావిస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా మరింత తోడ్పాటును అందించాలనీ కోరారు.
ఉద్యోగాల కోసం డిమాండ్ ఎక్కువగా వచ్చిన కంపెనీలు నియోజకవర్గంలోని మండలాల వారీగా జాబ్ మేళా ను నిర్వహించేలా విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ ,ఫార్మసీ చదివిన వారికి అపోలో ,యశోద, కామినేని హాస్పిటల్ లతో ఇతర హాస్పిటల్ లు , ఫార్మా కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళ నిర్వహించేలా కోరుతానని తెలిపారు. జాబ్ మేళా కోసం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం నుండి ఎవరు ఉద్యోగాలు కావాలని వచ్చిన వారి పట్ల సానుకూలంగా స్పందించాలని పలు కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ లో సెట్వీన్ లో ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శిక్షణ తీసుకొని విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చని ఈ ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని నియోజకవర్గ యువతకు సూచనలు చేశారు. నిన్న మాణిక్యపూర్ లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజి లో సీటు సాధించిన విద్యార్థులు ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత , వైస్ చైర్మన్ అయిలేని అనిత ,కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, ఆర్డీవో శ్రీరామ మూర్తి ,మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మున్సిపల్ కౌన్సిలర్లు ,ఇతర అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love