
నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రైతులకు ధాన్యానికి క్వింటాలకు రూ.500 రూపాయల బోనస్ చెల్లించే వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లాగవద్దు నరసింహ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి టిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేసి గద్దెక్కిన తర్వాత రైతన్నల నడ్డి విరిసిందని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అదేవిధంగా ఆరు గ్యారెంటీల పేరుతో అసలుకే మోసం చేసిందని, ఆర్టీసీ బస్సు తప్ప ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదని, రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదని, వికలాంగుల పింఛన్లు అంత మాత్రమే ఉందని, రెండు లక్షల రైతుల రుణమాఫీ రైతుబంధు, కళ్యాణ్ లక్ష్మి, చెక్కులతోపాటు తులం బంగారం, మోసం చేసి గద్దెకి ఎక్కిన తర్వాత నాలుగు నెలలు అవుతుంది. రైతుబంధు కింద పదివేల బదులు రూ.15000 ఇస్తానన్నాడు. డిసెంబర్ 9 తారీకు లోపు అమలు చేస్తానన్నాడు. ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదన్నాడు. గ్రామాలు గ్రామాలు తిరగపడాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గ్రామాలలోకి రాణివ్వమని రైతులు కోరుతున్నారు. మిషన్ భగీరథ నీరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి దక్కుతుందని ఆయన అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. కరెంటు పూర్తిగా ఉండట్లేదు, తాగునీరు అసలు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రెండు వందల ఇరవై మంది చనిపోతే, ఇంతవరకు కూడా పరామర్శించిన దాఖలు లేవని అన్నారు. రాబోయే సంస్థాగత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు అకి నపల్లి రమేష్, మండల ఉపాధ్యక్షుడు చుక్క గట్టయ్య, ఉద్యమకారులు అజ్మీర సురేష్, ఊట్ల మోహన్, నిమ్మగడ్డ స్వామి , బాలాజీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాలోతు గాంధీ, చల్వయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.