కంటోన్మెంట్ ప్రజలకు తొలివిడతగా 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

నవతెలంగాణ-హైదరాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు తొలివిడతగా 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ని అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని ఆయన సూచించారు. ఏడో వార్డులోని జయలక్ష్మి గార్డెన్ లో కంటోన్మెంట్ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ ను, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలకు 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని, కంటోన్మెంట్ కు మాత్రం 6 వేల ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.

Spread the love