రాష్ట్రంలో వైద్య శాఖను ప్రక్షాళన చేస్తాం..

– వైద్య శాఖలో సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ లు కల్పిస్తాం.‌.
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖను ప్రక్షాళన చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్స్ ను పురస్కరించుకుని ఉస్మానియా మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం  కోఠి లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధాన ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై విద్యార్థులకు బంగారు పతకాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వైద్య ఆరోగ్యశాఖలో  ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఆధునిక వైద్య కళాశాలను, వైద్యశాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విషయం కోర్టులో ఉన్న కోర్టు విషయం తేలగానే ఉస్మానియాను ఆధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని  అన్నారు. ప్రస్తుతం కమిషనర్లు డైరెక్టర్లు సీనియార్టీ ప్రకారం నియమిస్తున్నామని ఆయన తెలిపారు. వైద్య శాఖలో సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్ లు కల్పిస్తామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రు లపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రత్యేక చికిత్సలు ఉండేలా కృషి చేస్తామన్నారు. వైద్య అధికారులు ఉద్యోగులు అప నమ్మకంతో పని చేయవద్దని ఆయన సూచించారు. ఉస్మానియా అంటేనే ఒక బ్రాండ్ అని ఆయన అన్నారు అది మెడికల్ అయినా ఇంజనీరింగ్ అయినా ఉస్మానియానే అన్నారు. రాష్ట్రంలో మోడల్ లెక్చర్ హాల్స్ హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జూన్ బడ్జెట్లో వీటికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకువచ్చేలా కృషి చేస్తామని  చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మెడికల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ యాదవ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర కుమార్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్. డిప్యూటీ సూపర్ అంటే డాక్టర్ త్రివేణి, నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డాక్టర్ శివ శివరాం ప్రసాద్, అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, అధ్యక్షులు శ్రీధర్, కార్యదర్శి కృష్ణమూర్తి.  ఆఫీస్ ఇన్చార్జి రఘుమోహన్ , వేణుగోపాల్ గౌడ్, పూర్వ వైద్య విద్యార్థులు, యువ వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love