కామ్రేడ్‌ కిరణ్‌ ఆశయాలను కొనసాగిస్తాం

We will continue the ambitions of Comrade Kiran– ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడారు
– కామ్రేడ్‌ వీ.కిరణ్‌ సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కామ్రేడ్‌ వి. కిరణ్‌ పోరాటం చేశారని, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని పలు వురు వక్తలు తెలిపారు. ఐఎఫ్‌టీయూ హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, ఆటో అండ్‌ మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వి. ప్రవీణ్‌ అధ్యక్షతన ఐఎఫ్‌టీయు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణా ఆటో అండ్‌ మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (బి-2540) రాష్ట్ర అధ్యక్షు లు, నగర ప్రధాన కార్యదర్శి, సీపీఐ (ఎం.ఎల్‌.) మాన్‌ లైన్‌ నగర నా యకుడు వి. కిరణ్‌ సంస్మరణ సభ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సభకు సీపీఐ (ఎం.ఎల్‌.) మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి పొట్టు రంగారావు, మాస్‌ లైన్‌ సెక్రటేరియట్‌ సభ్యులు కే రమా,ఐఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం,మాస్‌ లైన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి, ఎం హన్మేశ్‌, ఐఎఫ్‌టీయూ హైదరాబాద్‌ అండ్‌ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఎస్‌ ఎల్‌ పద్మ, లింగం గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటు రంగారావు మాట్లాడుతూ కిరణ్‌ జీవితం ఆదర్శప్రాయమైనదని, ధన్యమైనదని అన్నారు. వలస కార్మికుడిగా నగరానికి వచ్చి, స్వతంత్రంగా జీవించే ఆటో రంగాన్ని ఎంచుకొని తన జీవితం గురించి మాత్రమే ఆలోచించకుండా, యావత్‌ ఆటో అండ్‌ మోటార్‌ కార్మికుల గురించి అలోచించడం గొప్ప విషయమన్నారు. వా రికి సంఘాన్ని (ఇతరులతో కలిసి) ఏర్పాటు చేసి, నగరంలో ప్రఖ్యాతి సంఘంగా ప్రాచుర్యంలోకి తెచ్చి, వేలాది మందిని సభ్యులుగా చే యడం గొప్ప విషయమని కొనియాడారు. తమ సంస్థ సంఘ కార్మి కుల గురించే కాక, సమాజంలో ఉన్న యావత్‌ ప్రజల గురించి కిరణ్‌ ఆలోచించాడన్నారు. అసమాన సమాజం, ప్రజలు జీవించలేని స్థితి ఎందుకుందని ప్రశ్నించారు. సమాజం బాగు పడాలంటే మార్కి ్సజం జెండా కింద పనిచేయాలని సంకల్పించారని… సీపీఐ (ఎం.ఎల్‌.) మా స్‌ లైన్‌ జిల్లా నాయకుడిగా ఎదిగాడన్నారు. కేసీఆర్‌, మోడి ప్రభు త్వా లు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ప్రజాస్వామిక హక్కులపై, నూతన ప్రజాస్వామ్య విప్లవానికై పరిత పించాడన్నారు.మాస్‌ లైన్‌ సెక్రటేరియట్‌ సభ్యులు కె. రమ మాట్లా డుతూ నిత్యం తన పని తాను చేసుకుంటూ, అహర్నిశలు కార్మికుల కోసం ఆలోచించడం అభినందనీ యమన్నారు. ఆ కోవలో కిరణ్‌ ఉన్నా డన్నారు. శ్రమ చేస్తూ శ్రమజీవుల గురించి ఆలోచిస్తూ, సంఘాన్ని నడుపుతూ, సంఘం నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసిన కిరణ్‌ ఆదర్శనీయమన్నారు.ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం మాట్లాడుతూ. నగరంలో ప్రారంభించిన ఆటో యూనియన్‌ ను రాష్ట్ర వ్యాపిత సంఘంగా విస్తరింపచేయడంలో వి. కిరణ్‌ది ప్ర ధాన పాత్ర ఉందన్నారు. ధైర్యంగా, మొండిగా, పోరాటాలు చేసేవా డ న్నారు.చిన్నవయస్సులోక్యాన్సర్‌వ్యాధితో మరణించడం బాధాకరమ న్నారు. ఎం. హన్మేశ్‌, ఎస్‌.ఎల్‌. పద్యలు మాట్లాడుతూ. కామ్రేడ్‌ కిరణ్‌ ఆటో కార్మిక సమస్యలైన మీటర్‌ రేట్ల కోసం, చలాన్లకు వ్యతిరేకంగా, పోలీసు జులుంకు వ్యతిరేకంగా, మోడీ తెచ్చిన మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా సంస్థ నాయకత్వంలో పోరాడారన్నారు. జేఏసీని ఏర్పాటు చేసి పోరాటం చేయడంలో కిరణ్‌ది కీలక పాత్ర అన్నారు. తెలంగాణా ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడారన్నారు. ఐఎఫ్‌ టీయూ జేఏసీ నాయకులు వెంకటేష్‌, శ్రీకాంత్‌,నల్లన్న, నారా యణ,లక్ష్మి, శ్రీనివాస్‌, షహనాజ్‌, అమరుడు వి. కిరణ్‌ సహచరి గంగక్క, పిల్లలు నరేష్‌, మహేశ్వరి, అల్లుడు నవీన్‌, లక్ష్మి, కిరణ్‌ తమ్ముళ్ళు స్వామి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love