భారత్‌లో వ్యాపారాన్ని కొనసాగిస్తాం

– డిస్నీ సిఇఒ వెల్లడి
న్యూయార్క్‌ : భారత్‌లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తామని డిస్నీ సిఇఒ బాబ్‌ ఐగర్‌ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీ భారత్‌లోని తన వ్యాపారాలను విక్రయించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలను ఐగర్‌ ఖండించారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అనేక మార్గాలను ఆన్వేషిస్తున్నామన్నారు. భారత్‌లో తమ వ్యాపారం సజావుగా సాగుతోందని.. లాభాలను ఆర్జిస్తున్నామన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో మార్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

Spread the love