బీఆర్‌ఎస్‌ను గద్దె దించి…తొమ్మిదేండ్ల కష్టాలు తొలగిస్తాం

– అస్సాం సీఎల్పీ నేత, సీడబ్ల్యూసి మెంబర్‌ దేబద్రత సైకియా
నవతెలంగాణ-గణపురం
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించి రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఇస్తే, బీఆర్‌ఎస్‌ను గద్దె దించి తొమ్మిదేండ్ల ప్రజల కష్టాలు తీరుస్తామని అస్సాం సీఎల్పీ నేత, సీడబ్ల్యూసీ మెంబర్‌ దేబద్రత సైకియా అన్నారు. తుక్కుగూడ విజయభేరీ సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీ కార్డుల ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాల యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియో జకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వ ర్యంలో ఊరేగింపుగా బైక్‌ ర్యాలీతో గణపురం మం డల కేంద్రానికి చేరుకోగా ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించి, రాజీవ్‌గాంధీ విగ్రహాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం ఆరు గ్యారెంటీ కార్డుల అంశాలను గ్రామం లోని ప్రజలకు అవగాహన కల్పించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయా ణం, తదితర వాటికి సంబంధించిన గ్యారెంటీ కార్డు లను గ్రామ ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్ని కల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తొమ్మి దేండ్లలో నియంతృత్వ పాలనతో ప్రజలను కష్టాలకు గురిచేశారని అన్నారు. ఇకపై కేసీఆర్‌ ఆటలు సాగని వ్వబోమని అన్నారు. గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ఆమెకు కాను కగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చే హామీ లతో కుడిన ‘అభయ హస్తం’ గ్యారెంటీ కార్డు రిజి స్ట్రేషన్‌ చేసుకునేందుకు 7286855555 నెంబ రుకు కాల్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దూడపాక శంకర్‌, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌, మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్‌, వైస్‌ ఎంపీపీ విడిదినేని అశోక్‌, జిల్లా నాయకులు బోనాల రాజమౌళి, ఇమ్మడి వెంకటేశ్వర్లు, మామిండ్ల మల్లికార్జున్‌, సుంకరి సుధాకర్‌ రెడ్డి, కట్కూరి శ్రీనివాస్‌, దూడపాక దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని అస్సాం సీఎల్పీ నేత దేవా బ్రత సైకియా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, దేశంలో బీజేపీ అవినీతి పాలన కొనసాగిస్తున్నాయన్నారు. ఆ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారంటీ సూత్రాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులను సన్మానించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్‌ గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్‌ వైస్‌ ఎంపీపీ విదిధినేని అశోక్‌, తదితర మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కష్టాలు తీర్చేది కాంగ్రెస్‌ మాత్రమే : మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు
మల్హర్‌రావు : ప్రజల కష్టాలు తీర్చేది కాంగ్రెస్‌్‌ పార్టీ మాత్రమేని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్‌ బాబు అన్నారు. తెలంగాణలోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సమగ్ర ప్రణాళిక చేసిన కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలను మంగళవారం మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి వివరించారు. స్థానిక కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో సంబంధిత కరపత్రాలను అందజేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 6 కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాలను సామాన్య నిరుపేద ప్రజలకు తప్పకుండా అందజేస్తామని వివరించారు.

Spread the love