అధికారంలోకి వస్తాం – హామీలన్నీ నెరవేరుస్తాం

– సుప్రియ శ్రీనటే
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‌
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోంద ని, ఇటీవల టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సమీ పంలోని తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభ లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఆ పార్టీ అఖిల భారత సోషల్‌, డిజిటల్‌ ఫ్లాట్‌ ఫాం చైర్మె న్‌ సుప్రియ శ్రీనటే తెలిపారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు, పిసిసి సభ్యులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ మె మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ అక్కడ అధికా రంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చిన విధంగానే తెలంగాణలో అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రజలకు ఇచ్చిన 6 హామీలను నెర వేరుస్తామని చెప్పారు. తెలంగాణలోని మహిళలకు గృహలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ. 2 వేలు, అలాగే ఆర్టీసి బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం, గృహ జ్యో తి పథకం కింద ప్రత ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ సరఫరాతో పాటు రూ.5 వందలకే గ్యాస్‌ లిండర్‌ను అందిస్తామని, రైతు భరోసా కింద ఎకరా నికి ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు కూడా అదే స్థాయిలో ఆర్ధిక సహాయం, ఇందిరమ్మ ఇంటి ప థకం ద్వారా గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధిక స హాయం, యువ వికాసం ద్వారా విద్యార్ధులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులను అందిస్తామని, చే యూత పెన్షన్‌ పథకం ద్వారా నెలకు రూ.4 వేలు ఇ స్తామని వివరించారు. అనంతరం పట్టణంలోని 11, 12 వార్డుల పరిధిలోని వీవర్స్‌ కాలనీలో పార్టీ కాం టెస్ట్‌ అభ్యర్ధులు శ్రీరాం శ్రీనివాస్‌, బొంతపల్లి నాగరా జులతో కలిసి గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియా రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ నవీన్‌ పెట్టం, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పిట్టల సతీస్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్య క్షులు బనుక శివరాజ్‌ యాదవ్‌ సీనియర్‌ నాయకులు నర్సింగరావు, మాజీ ఎంపిపి ధర్మగోవర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ సత్యనారాయణరెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఆలేటి సిద్దిరాములు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love