బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం..

– మాటల ప్రభుత్వం కాదు.. చేతుల్లో చేసి చూపుతాం
–  ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ డిచ్ పల్లి: ప్రమాద వశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలి బుడిదైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతుల్లో చేసి చూపుతామని, బాధితులకు అదుకుంటమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం ఇందల్ వాయి మండలంలోని దేవి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి తండా, యెల్లరెడ్డి పల్లి లో గత కొన్ని రోజుల క్రితం షాట్ షార్ట్ సర్క్యూట్ తో నివాసపు గృహాలు కూలిపోయిన విషయం తెలుసుకుని బాధిత కుటుంబాలకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నివాసపు ఇల్లు పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిద అయిందని, కుటుంబ సభ్యులు తినటానికి తిండి గింజలు లేక పస్తులుండి రోడుపైన చెట్టు కింద తలదాచుకుంటున్నరన్న విషయం తెలుసుకుని ఇందల్ వాయి మండల అధికారులతో సమీక్షించి కుటుంబానికి తక్షణ సహాయం కింద ప్రభుత్వం తరఫున 8000 వేల రూపాయలు, 25 కిలోల బియ్యం, ఇతర తినుబండారాలను అందజేశారు.
భాదిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి తాను సహకారం అందించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంకింద శాసనసభ్యులు భూపతి రెడ్డి తన వంతుగా బాధితులకు 10 వేల రుపాయలు సహాయం అందించారు. కేసీఆర్ దోరల పాలనకు ప్రజా భవన్ గా నామకరణం చేసి అక్కడ ఉన్న ఇనుప కంచేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు బద్దలు కొట్టి సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజా భవన్ కు వచ్చి ప్రజావాణిలో వినతులను అందజేసే విదంగా చర్యలు చేపట్టారని వివరించారు.
ఇదే కాకుండా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డుల హామీ లను 100రోజుల్లోనే ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసి చూపమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2009నుండి నమోదైన కేసులను విరమిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో అరాచకం, అంత ఇంత కాదని, అదికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే చేసి చూపమని చెప్పారు.

పది, ఇంటర్ అపైన జరిగిన పరిక్షల పేపర్ లను బజారులో దొరికే విదంగా చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడరని మండిపడ్డారు. ఆరోజే సారైనా నిర్ణయం చేసి ఉంటే విద్యార్థుల జీవితాలు చిన్న బిన్నం కాకుండా ఉండేదని,టిఎస్ఎస్ పి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, పోలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచేట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా, మాజీ ఎంపిటిసిలు చింతల కిషన్, డాక్టర్ శ్రీనివాస్, బోర్ వెల్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బైరయ్య, డిసిసి డెలిగేట్ సుధాకర్, ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్, హబిబ్, మోహ్సిన్, మోతిలాల్ నాయక్, ఎల్ ఐ సి గంగాధర్, శివారం మహారాజ్ లతోపాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love