నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎంఐఎం ఆటలు సాగనివ్వమనీ, అవసరమైతే దారుస్సలాంలోని ఆ పార్టీ కార్యాలయంపై జెండా ఎగరేస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ముందు మీడియాకు వీడియో సందేశం పంపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలు విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలు తన ఇల్లు, ఆఫీస్‌పై దాడికి ప్రయత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. ఆత్మరక్షణకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టారని చెప్పారు. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తామే నిజమైన దేశ భక్తులమని చెప్ప డాన్ని ఆయన ఎద్దేవా చేశారు. వారు ఏ దేశానికి… పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కి దేశభక్తులా అని ప్రశ్నించారు. భారతదేశ దేశభక్తులు అయితే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంవద్దకు వచ్చి, జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలని సవాల్ విసిరారు.