కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

– కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌
– ఆమనగల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు
నవతెలంగాణ-ఆమనగల్‌
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ఆమనగల్‌ పట్టణంలోని 6వ వార్డుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక నారాయణ సాగర్‌ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమన్నారు. అదేవిధంగా రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమనగల్‌ మున్సిపాలిటీలో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందని అన్నారు. అంతకు ముందు ఆయా పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్న నాయకులు కార్యకర్తలు మహిళలను ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు నేనావత్‌ పత్య నాయక్‌, ఉపాధ్యక్షులు పూసల భాస్కర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చుక్క నిరంజన్‌ గౌడ్‌, వడ్డే వెంకటేష్‌, కౌన్సిలర్‌ కమటం రాధమ్మ వెంకటయ్య, సీనియర్‌ నాయకులు సయ్యద్‌ ఖలీల్‌, తల్లోజు రామకష్ణ, మాజీ వార్డు సభ్యులు వస్పుల సాయిలు, పూసల సత్యం, మల్లేష్‌ నాయక్‌, కొమ్ము ప్రసాద్‌, తోట కష్ణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love