నవతెలంగాణ -పెద్దవంగర: పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్ రావు అన్నారు. బొమ్మకల్లు గ్రామంలో కేతిరెడ్డి మోహన్ రెడ్డి (62), కాండ్య తండాలో ధరావత్ సురేష్ (28) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆమె మండల నాయకులతో కలిసి మంగళవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటామని భరోసా కల్పించారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సర్పంచ్ కేతిరెడ్డి దీపిక సోమనరసింహా రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, మండల నాయకులు శ్రీరామ్ సుదీర్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్, సలిదండి సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గంగాధర్, మాజీ ఎంపీటీసీ, మండల ప్రచార కార్యదర్శి పసులేటి వెంకట్రామయ్య, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షుడు గిరగాని రవి తదితరులు ఉన్నారు.