నవతెలంగాణ-ధర్మారం:-
మండలంలోని పత్తిపాక గ్రామంలో విష జ్వరాలు ప్రవళిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి విష జ్వరాలు సోకిన వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అంది స్తామని పేద ప్రజలకు అండగా ఉంటామని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని,నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, మీకు తోడుగా నేను,జిల్లా అధికార యంత్రాంగం అంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మండలం లోని పత్తిపాక గ్రామానికి చెందిన గ్రామస్తులు గత వారం రోజులుగా విష జ్వరాలతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న *ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం రోజున భారీగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పత్తిపాక గ్రామంలో జిల్లా వైద్య అధికారులతో కలిసి పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు వారం రోజులుగా పత్తిపాక గ్రామస్తులు విష జ్వరాలతో బాధ పడుతున్నారన్న విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేను జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాదికారులతో మాట్లాడటం జరిగిందని, ఈ రోజు స్వయంగా జిల్లా వైద్య అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించడం జరిగిందని,వర్షం కురవడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని,ఎవ్వరూ అదైర్య పడాల్సిన అవసరం లేదని మండలం లో ఎక్కడ వైద్య పరంగా అవసరం ఉన్న తన దృష్టికి,మండల అధికారుల దృష్టికి తీసుకురావాలని,వారికి అవసరమైన వైద్య సహాయం వెంటనే అందించడం జరుగుతుందనీ,ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ,నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకోవాలని,గ్రామ పంచాయతీ తరఫున కూడా గ్రామంలో ఎక్కడ చెత్త లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడటం జరిగిందని మంగళవారం రోజున ఒక మెడికల్ క్యాంపును కూడా పత్తిపాక గ్రామంలో ఏర్పాటు చేస్తామని,ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని మీకు తోడుగా నేను,జిల్లా అధికార యంత్రాంగం అంత ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీ రమేష్, మండల వైద్యాధికారి డాక్టర్ సుస్మిత, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్ పాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం సుజాత రవీందర్ రెడ్డి,, సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్స్ బద్దం గంగారెడ్డి, కోల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి,ఎన్న్ నాయకులు ఎదుల అంజయ్య, అన్నడి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు