ప్రభుత్వం వ్యవసాయ కూలీలను విస్మరిస్తే ప్రతిఘటిస్తాం అని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.కృష్ణ, రామకృష్ణ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో శనివారం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు:రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అన్న మాట నిలుపికోవాలని అయన కోరారు. రెండు పంటలు ముగిసిన కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీన వేషాలు లెక్కిస్తుందన్నారు. రైతన్ననికి పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం రైతు బరోస వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదింటి కల నెరవేరేస్తామని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గాని ఎక్కడ అమలుకు పూనుకున్నది లేదన్నారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తుంది అన్నారు. వ్యవసాయకులకు భృతి కింద 12వేలు సంవత్సరంకు వేస్తా అని ఇంకా అమలు చేయడం లేదు అన్నారు. చాలా కాలంగా రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి అని ఆయన కోరారు. రేషన్ షాప్ ల ద్వారా సన్నబియ్యం అందిస్తాం అని ఇంకా ఇవ్వడం లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయకూలీలకు 12వేల భృతి, రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి . కిషన్ తదితరులు పాల్గొన్నారు.