– కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పౌరసరఫరాల వ్యవస్థను సరళీకృతం చేయనున్నట్టు కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్‌తో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులు స్ఫూర్తిదాయకమని తెలిపారు. వ్యవస్థను మెరుగు పరిచడంలో కేంద్రం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణా రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలుస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో జనపోషణ కేంద్రాల పని తీరు భేష్ అంటూ ప్రశంసించారు. రేషన్‌డీలర్ల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వారి పనితీరుపై తెల్లరేషన్ కార్డు దారులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. బియ్యం, గోధుమల సరఫరాలో నాణ్యత పరిణామాలు పాటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో చౌక ధరల డీలర్ల ఆదాయం సగటున రూ. 30 వేలు ఉందనీ, విక్రయాలను పెంచుకుంటే రూ.లక్ష దాకా ఆదాయముంటుందని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా పర్యటిం చిన చోప్రా పౌర సరఫరాల కార్యాలయం సందర్శంచి, ధాన్యం కొనుగోలు వ్యవస్థాగత మార్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ ఏ.జీ కాలనిలో చౌక ధరల దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
అక్కడ వినియో గదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమల నాణ్యతను పరిశీలిం చారు. డీలర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీపై తెల్లరేషన్ కార్డుదారులతో ముఖాముఖి జరిపారు. తెలం గాణా ప్రభుత్వం దాన్యంకొనుగోలు అంశంలో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పు లు బాగున్నాయంటూ అభినందించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణా ప్రభు త్వం తీసుకొచ్చిన మార్పులు రోల్‌మోడల్‌గా ఉండేందుకు కేంద్రం దోహద డప డుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, అందులో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులను వివరించారు.