గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తాం

– సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్‌
ఐక్యత ఫౌండేషన్‌ ద్వారా పేద ప్రజలం దరికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిం చడమే లక్ష్యంగా, మారుమూల గిరిజన ప్రాంతా ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్టు ఐక్యత ఫౌండేషన్‌ చైర్మెన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శంకర్‌ కొండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దయ్యాల బోడు తండా, మేడిగడ్డ గ్రామపంచా యతీ పరిధిలోని చెప్ట తండాలలో ఆయన పర్యటించారు. ఆయా తండాలలో ప్రజల విజ్ఞప్తి మేరకు దయ్యాల బోడ్‌తండాలో ఆంజనేయస్వా మి గుడి నిర్మాణానికి సహకామందిస్తానని, యువతకు క్రికెట్‌ కిట్‌ అందజేస్తామని అన్నారు. చెప్ట తండాలో ఆంజనేయ స్వామి గుడికి గ్రిల్స్‌, బండలు, అదేవిధంగా ఇటీవల కురిసిన గాలి వానకు తండాకు చెందిన నేనావత్‌ జగన్‌ ఇల్లుపై కప్పు రేకులు కూలిపోయాయని బాధితుడు సహాయం అడగగా తప్పనిసరిగా సహకార మందిస్తానని హామీ ఇచ్చారు. 8 నెలల నుంచి ఈ ప్రాంత అభివృద్దికి, ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను ఆచరణాత్మాకంగా అమలు చేస్తూ పనిచేసే ప్రజల మనిషిగా అందరికీ సేవలందించడం మీలో ఒకడిగా మీ ఆప్తుడిగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిగడ్డ ఉప సర్పంచ్‌ మల్లేష్‌నాయక్‌, వార్డు మెంబర్లు చంద్రు నాయక్‌, రాజు నాయక్‌, టాఖ్య, అంజ్య, భీంలా, రోజ్య, రమేష్‌, ఈశ్వర్‌, పూజారి, యువకులు శ్రీ ను, నవీన్‌, సాయి హన్మంతు, తండా ప్రజలు, ఐక్యత ఫౌండేషన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love