పథకాలపై అవగాహన కల్పించడానికే వీక్షిత్ సంకల్ప యాత్ర…

– గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ అశ్విన్ శ్రీ వాస్తవ..
నవతెలంగాణ-డిచ్ పల్లి: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో అవగాహన కల్పించడమే వీక్షిత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ అశ్విన్ శ్రీ వాస్తవ అన్నారు .ఆదివారం డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో భారత్ సంకల్ప యాత్రను ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి మోడీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా తెలిసే విధంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎంపీపీ గద్దె భూమన్న, సర్పంచ్ గోపాల చిన్న నర్సయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి టివిఎస్ గోపి బాబు,ఎంపిఓ శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి,బిల్ కలెక్టర్ షేక్ అసిఫోద్దిన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love