నవతెలంగాణ విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీపీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని పలువురు సీనియర్ నేతలు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబును పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో అనుసరించారు. గన్నవరం విమానాశ్రయం, జాతీయ రహదారి పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ టీడీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆటంకాలను లెక్కచేయకుండా యువత చంద్రబాబును అనుసరించారు. యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. నియోజకవర్గం మొత్తం భారీగా పూల వర్షంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలింది. ఉండవల్లిలోని తన నివాసంలో కాసేపట్లో పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు.