– దావోస్‌లో భారీ పెట్టుబడులపై పలువురి అభినందనలు
– శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పార్టీ శ్రేణులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు కలిసి అభినందించారు. దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.