సంక్షేమం సరే… ఉపాధి వైపు ద్రుష్టి ఏది 

– పనులు లేక యువత వ్యసనలా బాట 

– ఉపాధి కోసం ప్రజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు 
నవతెలంగాణ – భైంసా
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారే తప్ప వారికి ఉపాధి మార్గం వైపు ఆలోచించడం లేదు పాలకులు. సంక్షేమంపై దృష్టి సారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజానీకానికి ఉపాధి మార్గంపై అంతంత మాత్రమే ద్రుష్టి సారిస్తుంది. దీంతో గ్రామాల్లో పనులు లేక ప్రజలు ఉపాధి కోసంపరితపిస్తున్నారు.ఇంటర్మీడియట్, డిగ్రీలు చేసిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద మొత్తంలో పోటీ ఉండడంతో, ఆ వైపు వెళ్లక ప్రైవేటు వైపు ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నా ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రామంలో పదివేల రూపాయల ఉద్యోగం కోసం 50 నుంచి 100 మంది యువత ముందుకు వస్తున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. ఒకప్పుడు బైంసా పట్టణం పారిశ్రామిక కేంద్రానికి అడ్డాగా ఉండేది. జిమ్మింగ్ ఫ్యాక్టరీలు తగ్గిపోవడం మూలంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో జన్నింగ్ ఫ్యాక్టరీల మూలంగా ఇక్కడి ప్రజానీకానికి ఉపాధి దొరికేది. ప్రస్తుతం మన ప్రాంతంలో ఇండస్ట్రీలు లేకపోవడం మూలంగా పనులు చేసుకోవాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. యువకులకు ఉద్యోగాలు దొరకకపోవడంతో గ్రామాల్లో యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారు ప్రతి గ్రామంలో గంజాయి, మద్యం బారిన యువత పడుతుందని లో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం వేసవిలో 100 రోజులపాటు ఉపాధి హామీ పథకం ద్వారాఉపాధి కల్పించినప్పటికీ మిగతా రోజుల్లో పని కోసం పాకులాడాల్సిన పరిస్థితి దాపురించింది. బాసర త్రిబుల్ ఐటీ లో సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు, క్యాటరింగ్ చేయడానికి ఉద్యోగుల కోసం ఇక్కడి ప్రజలు పోటీ పడుతున్నారంటే నిరుద్యోగం ఎంత పట్టిపీడిస్తుందో అర్థం అవుతుంది. దశాబ్దాల పాటు ఇక్కడ పాలించిన పాలకులు నిరుద్యోగంరూపు మాపడంపై దృష్టి సారించలేదు. ఇకనైనా ముధోల్ నియోజక వర్గ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గం ఏర్పాటు చేస్తే నియోజకవర్గ అభివృద్ధి బాటలో ముందడుగు వేస్తుంది..
Spread the love