బిఎస్పీతోనే అణగారిన వర్గాలు  సంక్షేమం

నవతెలంగాణ- మల్హర్ రావు: బీఎస్పీ అధికారంలోకి వస్తేనే అణగారిన వర్గాలు,బహుజనులు సంక్షేమంగా ఉంటారని బిఎస్పీ మండల నాయకులు రాజ్ కుమార్, రాగం ఐలయ్య, బొంతల రాజు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పెద్దతూoడ్ల, శాత్రజ్ పల్లి, కిషన్ రావుపల్లి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంథని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణరెడ్డికి ఏనుగు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్దిoచారు. బిఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజన, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మంథనిలో చల్లా నారాయణ రెడ్డి గెలుపే దిశగా ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా, ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love