సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

– పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్

నవతెలంగాణ-మద్నూర్ : బి ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు మద్నూర్ ఉమ్మడి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దిన్ దయాల్ మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు షేక్ గఫర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ ఫలాల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా అవగాహన కల్పించారు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వాటిని ప్రజలకు వివరంగా తెలియపరచి వచ్చే ఎన్నికల్లో మళ్లీ బి ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించుకునే విధంగా కృషి చేయాలని గ్రామ సర్పంచ్కు ఎంపీటీసీకి గ్రామానికి చెందిన పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలని కోరారు
Spread the love