బాసర గోదావరి నది మొదటి ఘాట్ వద్ద సోమవారం గోదావరి నదిలో స్నానమాచరిస్తూ ప్రమాదవషాత్తు కాలుజారి ఒకరు మృతి చెందినట్లు ఎస్ ఐ గణేష్ తెలిపారు. ఎస్ఐ తెల్పిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం రత్నల్లి గ్రామానికి చెందిన పవార్ బాలాజి (25) కుటుంబ సమేతంగా శుభకార్యానికి వచ్చాడు.నది లో స్నామాచారిస్తూ ప్రమాదవశాత్తు కాలు జారీ నదిలో నీట మునిగి మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో నదిలో మృత దేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న ఎస్సై గణేష్ తెలిపారు. మృతుడికి భార్య,కుమారుడు వున్నారు.మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.