ఇండియా-ఏ గెలుపు

హాంకాంగ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం
మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023
ముంబయి: ఆసియాకప్‌ టోర్నీకి ముందు జరుగుతున్న మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 ఇండియా-ఏ జట్టు ఘన విజయం సాధించింది. హాంకాంగ్‌ మహిళలతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 9వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచిన ఇండియా-ఏ కెప్టెన్‌ శ్వేతా షెహ్రావత్‌ తొలిగా బౌలింగ్‌ ఎంచుకోగా.. హాంకాంగ్‌ జట్టును 14ఓవర్లలో 34పరుగులకే పరిమితం చేశారు. యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌ మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి రెండు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంకతోపాటు మన్నత్‌ కశ్యప్‌ కూడా రెండు ఓవర్లలో రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత అమ్మాయిలు చెలరేగా రు. కేవలం ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్‌ శ్వేత అవుటైనా.. తెలుగమ్మాయి గొంగడి త్రిష, ఉమా ఛెత్రీ ఇద్దరూ అద్భుతంగా ఆడి జట్టుకు విజయం అందించారు. ఈ టోర్నీలో ఇండియా-ఎ అమ్మాయిలు తర్వాతి మ్యాచుల్లో థారుల్యాండ్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లతో తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో చెలరేగిన శ్రేయాంక పాటిల్‌ డబ్ల్యూపీఎల్‌లోనూ రాణించింది. అలాగే బిసిసిఐ ఈ ఏడాది ప్రారంభించిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో ఆమె ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించింది.

Spread the love