ఏం జరుగుతుంది.. అంత అయోమయం..

– టీయూ వ్యవహారం కొలిక్కి వచ్చేదేప్పుడు..?
– టీయూ లో మళ్ళీ పాత కాథే…
– ఈసీ యాదగిరి కి పచ్చజెండా..విసి రెడ్ సిగ్నల్.. 
– నూతన రిజిస్ట్రార్ గా ప్రోఫెసర్ కనకయ్య..
– బాధ్యతల స్వీకరణ…
 నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో అసలు ఏం జరుగుతుంది.. యూనివర్సిటీ లో జరుగుతున్న పరిణామాలు ఇటు జిల్లా ప్రజా ప్రతినిధులకు,అటు ప్రభుత్వానికి తలనోప్పులు తేచ్చి పేడుతున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుండి ఎప్పుడూ లేనిది గత కొన్ని నెలలుగా ఈసీ వర్సేస్ వీసి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రితిలో కోనసాగుతుంది.అక్రమాలు, అవకత వకలకు పాల్పడిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  రవీందర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం హైదరాబాద్ లోని రూసా, సెగ్రెటెరియట్ లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. హైదరాబాద్ లోని రూసా, కొత్త సచివాలయంలో యూనివర్సిటీ పాలకమండలి 59వ సమావేశానికి వైస్ ఛాన్సలర్ రేండవ సారి మళ్ళీ గైర్హాజరయ్యారు. గత్యంతరం లేక సమావేశానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ చైర్మన్ గా వ్యవహరించారు.
గత నెల 19, 26, ఈ నెల 5, 12వ తేదీల్లో తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నేపథ్యంలో బుధ వారం సాయంత్రం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ యాదగిరికి బదులు మరో ముగ్గురి పేర్లను వాట్సాప్ ద్వారా సభ్యులకు ప్రతిపాదిం చడం విశేషం. ఇందులో చంద్రశేఖర్, రాంబాబు, గతంలో పాలకమండలి తొలగించిన కనకయ్య పేర్లు ఉన్నాయి. వీళ్లలో కనకయ్యను అవినీతి, అక్రమాల నేపథ్యంలో గతంలోనే ఈసీ తొలగించింది. కనకయ్యను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇక రాంబాబు కూడా కనకయ్య లాగే వీసీకి అత్యంత సన్నిహితుడు. ఇక చంద్రశేఖర్ విషయానికి వస్తే మాత్రం వీసీతో అయనకు పడిరాదు.పాలక మండలి నిర్వహించిన 55, 56, 57, 58 సమావేశాల్లో చేసిన తీర్మానాల విషయమై సమావేశంలో సమీక్షించారు. 60వ సమావేశాన్ని జూన్ 3న నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి (ఈసీ) 59వ సమావేశం గురువారం నిర్వహించిన  యూనివర్సిటీ వివాదానికి ముగింపు పలుక లేదు. ఒకపక్క యూనివర్సిటీ పాలకమండలి సమావేశం ముగిసి ఒక్క రోజు గడవక ముందే మరుసటి రోజే మళ్లీ కథా మొదటికి వచ్చింది.పాలకమండలి చెసిన తీర్మానాలు బుట్ట దాఖలు చేస్తు రెండవసారి ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్యకు రిజిస్టర్ గా నియామక పత్రాన్ని వైస్ ఛాన్సలర్ స్వయాన అందజేశారు.ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు నాలుగు సమావేశాలు జరిగిన ఒక్క సమస్య కూడా కొలిక్కి రాకపోవడం విశేషం. కానీ రిజిస్ట్రార్ నియామకం మాత్రం కొలిక్కి రావడం పేద్ద సమస్య గా మారిపోయింది. ఇదిలా ఉంటే వీసీ రవీందర్  ఈ సమావేశానికి ముందు వైస్ ఛాన్సలర్ రవిందర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లుగా ముగ్గురి పేర్లను వాట్సాప్ ద్వారా ఈసి సభ్యులకు అందజేశారు. ఈ మూడు పేర్లలో ఏదో ఒక పేరును పాలకమండలి సమావేశంలో ఆమోదిస్తారని అందరు అనుకున్నారు .కానీ పాలకమండలి మాత్రం రిజిస్ట్రార్ గా మళ్లీ యాదగిరి పేరునే ఆమోదిస్తు ఈసి తీర్మానం చేసింది.
రిజిస్ట్రార్ కోసం ఎందుకంత గడబడు..
తెలంగాణ యూనివర్సిటీ  రిజిస్ట్రార్ నియామకానికి గత రెండు నెలలుగా నానుతునే ఉంది. ఇప్పటికే రిజిస్ట్రార్ గా యాదగిరి ఈసీ నియమించి నప్పటికి వీసీ రవీందర్  అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. చివరికి ఎలాగైనా రిజిస్ట్రార్ ఛాంబర్ కు తాళం వేయించి యాదగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో కుర్చుండకుండా చేసి సఫలమయ్యారు. ఇలా మళ్లీ రిజిస్ట్రార్ నియామకం ఎక్కడ వేసిన గొంగడి అక్కడె అన్న చందంగా తయారైంది. పాలకమండలి సమావేశానికి వీసి పంపిన ముగ్గురు పేర్లను ఈసీ సభ్యులు పట్టించుకోలేదు. తెలంగాణ యూనివర్సిటీ కి చెందిన ఘంట చంద్రశేఖర్ (మాస్ కమ్యూనికేషన్), రాంబాబు(కామర్స్), అరుణ (బాట్నిలు ఉన్నారు. వీరిలో ఈసీ ఎవరిని ఎంపిక చేయలేదు. యాదగిరిపై వీసీ ససేమిరా అనడంతో పాటు ప్రొఫెసర్ పదోన్నతుల్లోనూ యాదగిరి ఉండటం, వీసీ కోర్టు నుంచి యాదగిరిపై మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావడంతో సమస్య వచ్చిపడింది.2021 లో కనకయ్యను రిజిస్ట్రార్ గా నియమించి ఈసీ అనుమతి పొందారు. ఆ తరువాత అనూహ్యంగా సర్వీస్ రికార్డులు, అవుట్ సోర్సింగ్ వ్యవహారం బయటికి రావడంతో కనకయ్యను తొలగించారు.అనాడు ఈసీ యాదగిరి ని రిజిస్ట్రార్ గా నియమించారు. నెల రోజుల వ్యవధిలోనే యాదగిరికి వీసీ పలు ఆరోపణలు బూచి చూపి సాగనంపారు. దీంతో యాదగిరి వెనక్కి తగ్గడంతో వీసీ రవీందర్ రిజిస్ట్రార్ శివశంకర్ ను నియమించారు. ఇక అప్పటి నుంచి ఏప్రిల్ 19, 2023 వరకు 18 నెలల పాటు ఈసీ సమావేశం జరిగిన దాఖలాలు లేవు. శివశంకర్ 10 నెలల పాటు, విద్యా వర్దిని 8 నెలల పాటు పని చేశారు. వీరి నియామకానికి పాలకమండలి అనుమతి అసలుకే లేదు. వీరి హయాంలో చేసిన జమ, ఖర్చులు, లెక్కలు, అభివృద్ధి, నియామకాలకు ఈసీ ఆమోదం నేటి వరకు పోందలేదు. 2021 లో రెండు నెలల పాటు కనకయ్య రిజిస్ట్రార్ గా పని చేశారు. అప్పట్లో అవుట్ సోర్సింగ్ లో వీసీ దొడ్డి దారిలో 113 మందిని నియమించారనే అపావదును ముఠా కుట్టుకున్నారు . 113మంది అవుట్సోర్సింగ్ నియామకం పోందిన వారందరికీ  ఈసీ ఆమోదం లేదని రిజిస్ట్రార్ కనకయ్య వేతనాలు ఇవ్వలేదు. సర్వీస్ రికార్డుల వివాదం  ఉంది. వీటిని సాకుగా చూపి ఈసీ కనకయ్యను తొలగించి యాదగిరిని నియమించారు.యాదగిరి కోన్ని నేలలకే పరిమితమై ఇలా వచ్చి అలా వేళ్ళగోట్టారు.మళ్ళి శివశంకర్ ను రిజిస్ట్రార్ గా నియమించారు. అక్కడి నుంచే అసలు తంతు మొదలైందనే విమర్శలు యూనివర్సిటీ లో వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో ఈసీ కనకయ్యను తొలగించి యాదగిరిని నియమిస్తే, వీసీ యాదగిరిని తొలగించి శివశంకర్ ను నియమించారు.2021 నవంబర్, డిసెంబర్ లలో జరిగిన -వ్యవహారమే 2023 ఏప్రిల్, మే లో జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈసీ మళ్లీ యాదగిరిని నియమిస్తే, విసి ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన నిర్మల దేవి ని నియమించారు.ఇవన్ని ఆఘమేఘాల మీద చకచకా జరిగిపోయాయి.అమే నియామకం చెల్లదని ఈసీ సమావేశం నిర్వహించి తోలగించడానికి ప్రయత్నాలు చేసి  ఆమెకు అమె నే తిరిగి వెళ్ళిపో యారు.
ఇకనైనా ఫూల్ స్టాప్ పడేనా..?
తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్యకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ శుక్రవారం నియమించారు.ఈయన నియామకం తో రిజిస్ట్రార్ వివాదం ముగిస్తుంద ?లేక మళ్ళీ వివాదం మొదటికి వస్తుంద అనే చర్చ యూనివర్సిటీ లో వినిపిస్తున్నాయి.
నూతన రిజిస్ట్రార్ గా కనకయ్య బాధ్యతల స్వీకరణ..
 తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్ గా ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య ను వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవీందర్  నియమించారు.వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ చేతుల మీదుగా  ప్రొఫెసర్ కనకయ్య రిజిస్ట్రార్ గా ఉత్తర్వులు శుక్రవారం అందుకున్నారు.
ప్రొఫెసర్ కనకయ్య తెలంగాణ యూనివర్సిటీ లోని అనేక పరిపాలన పదవులను చేపట్టారు. ఆర్ట్స్ డీన్ గా ఉంటూ  తెలుగు సాహిత్యంలో గుండె డప్పు కనకయ్య గా ప్రఖ్యాతిగాంచారు. దళిత సాహిత్యంలో అనేక రచనలు చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కనకయ్య మాట్లాడుతూ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్, పాలక మండలి సభ్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థుల సహకారంతో  తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని , అందరి సహకారం ఉంటేనే భవిష్యత్తులో యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుందని, వర్సిటీ అభివృద్ధి లో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని, యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తద్వారా అభివృద్ధి సాధ్యమని తెలిపారు.  ఈ అవకాశం ఇచ్చిన వైస్ చాన్స్ లర్ కు ప్రొఫెసర్ డాక్టర్.కనకయ్య  కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్యకు,  అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పాలక మండలి సభ్యులు అభినందనలు తెలిపారు.
Spread the love