ఓటరు మదిలో ఏముందో ఏమో…

– ఇల్లందులో 20 మంది అభ్యర్థుల పోటీ
– 15 మంది ఆదివాసీ, ఐదుగురు బంజారాలు
– ఇండిపెండెట్స్‌గా 16 మంది
– ఓట్ల చీలికలు అనివార్యం
– ఎన్నికలు ఉత్కంఠభరితమే
నవతెలంగాణ-ఇల్లందు
ఎన్నికల ప్రచారాలు ముగిసిన అనంతరం అంతా సైలెంట్‌గా ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు తాయిలాలు, డబ్బు పంపిణీ చేసినప్పటికి ప్రచారాలకు నీళ్ళలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికి ఎవరికి ఓటేయాలో ఓటరు డిసైడ్‌ చేసుకున్నారు. ఇల్లందు ఎస్‌టి నియోజకవర్గం. నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బానోత్‌ హరిప్రియ నాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోరం కనయ్య, సీపీఐ(ఎం) అభ్యర్థిగా దుగ్గి కృష్ణ, బీజేపి అభ్యర్ధిగా రవీంద్ర నాయక్‌, బీఎస్‌పి అభ్యర్ధిగా బాదావత్‌ ప్రతాప్‌లు పోటీలో ఉన్నారు. వీరిలో హరిప్రియ మాజీ ఎంఎల్‌ఏ కాగా కోరం కనయ్య జడ్‌పి ఛైర్మన్‌గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లొ సైతం వీరిద్దరూ పోటీ చేశారు. గెలిచిన అనంతరం ఇద్దరూ పార్టీలు మారినవారే. మాజీ ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య కూతురు డా. అనురాధ ఇండిపెండెంట్‌ గా పోటీలో ఉంది. న్యూడెమోక్రసీ మద్దతు ఇస్తోంది. ప్రజాపంథా పార్టీల తరపున ఇల్లందు మండలానికి చెందిన మాణిక్యారం సర్పంచ్‌ మోకాళ్ళ కృష్ణ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్ధిగా చీమల వెంకటేశ్శర్లు, ఆబాద్‌ పార్టీ తరపున రిటైర్డ్‌ సీఐ జార బిక్షం పోటీ చేస్తున్నారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీతోపాటుగా ఇక కొత్త పార్టీలు ఇండిపెండెంట్స్‌గా రంగలో ఉన్నాయి. ఎస్‌టీ నియోజకవర్గమైన ఇల్లందులో ఆదివాసీలు 15 మంది. బంజారాలు 5గురు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరెన్ని ఓట్లు చీలుస్తారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు భయం భయంగా ఉన్నారు. దీంతో ఓట్లు తారుమారై ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠతగా ఉన్నారు.

Spread the love