T20 World Cup : ముగిసిన భారత్ బ్యాటింగ్..ఆఫ్ఘన్ టార్గెట్ ఎంతంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భార‌త్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ టాపార్డ‌ర్ త‌డ‌బ‌డింది. అఫ్గ‌న్ స్పిన్న‌ర్ల విజృంభ‌ణ‌తో టీమిండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కీల‌క వికెట్లు కోల్పోయింది. 62 ప‌రుగుల‌కే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(8), విరాట్ కోహ్లీ(24), రిష‌భ్ పంత్‌(20)లు పెవిలియ‌న్ చేరారు. దాంతో, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్(53), హర్దిక్ పాండ్యా (32) పరుగులు చేయడంతో 181 సోరు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరుఖీ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా నవీన్ హుల్ హక్ ఒక వికెట్ తీశాడు.

Spread the love