ఇంత కంటే ఏం కావాలి?

What more do you want?చిరంజీవి నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్‌ శనివారం మీడియాతో ముచ్చటించారు. ‘రజనీకాంత్‌కి సిస్టర్‌గా నటించా. అలాగే ఇప్పుడు చిరంజీవికి సిస్టర్‌గా కనిపించడం ఆనందంగా ఉంది. చిరంజీవి, రజనీకాంత్‌.. ఇద్దరు బిగ్గెస్ట్‌ స్టార్స్‌తో నటించాను. ఇంతకంటే ఏం కావాలి. ఈ సినిమాలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే, చిరంజీవితో డ్యాన్స్‌ చేసే అవకాశం కూడా దొరికింది. ఆయనతో ఒక్క ఫ్రేమ్‌ లోనైనా డ్యాన్స్‌ చేయాలని వుండేది. కానీ ఇందులో రెండు పాటల్లో డ్యాన్స్‌ చేసే అవకాశం దొరికింది.
దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. అయితే సిస్టర్‌ క్యారెక్టర్‌ అనగానే డ్యాన్స్‌ చేసే అవకాశం ఉండదేమో అని భయపడ్డా. కానీ ఇందులో నా క్యారెక్టర్‌కి ఆ స్కోప్‌ ఉంది. అన్నయ్యతో చాలా బబ్లీ, జాలీగా ఉండే క్యారెక్టర్‌ కాబట్టి సూపర్‌గా కుదిరింది. ఈ సినిమా కథ ప్రధానంగా బ్రదర్‌ సిస్టర్‌ స్టొరీ. బ్రదర్‌ సిస్టర్‌ ఎమోషన్‌తో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పక్కా ప్యాకేజ్‌గా ఉంటుంది. మా అమ్మ చిరంజీవితో ‘పున్నమినాగు’ చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి ఎనర్జీ, డెడికేషన్‌, అలాగే సెట్‌లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్‌గా చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవితో నేను చెప్పినపుడు.. చిరంజీవి రియాక్షన్‌ నాకు చాలా సర్ప్రైజ్‌ చేసింది. ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్ట్రీట్‌ స్మార్ట్‌ నువ్వు’ అని చిరంజీవి అన్నారు( నవ్వుతూ). సాధ్యమైనంత వరకు మంచి పాత్రలతో మెప్పిస్తా’ అని కీర్తి సురేష్‌ అన్నారు.

Spread the love