మోడీ రావడం వల్ల ఏమవుతుంది? ఆయన ఏమైనా పరమాత్ముడా?

నవతెలంగాణ- న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రోజు జరిగిన  రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ సమస్యపై 167వ నిబంధన ప్రకారం రాజ్యసభలో చర్చించాలని ఆయన కోరారు. చర్చ జరిగే సమయంలో ప్రధాన మంత్రి సభలో ఉండాలని కోరారు. మోడీ సభకు హాజరుకావాలనే డిమాండ్‌ను అధికార పక్ష సభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఖర్గే బీజేపీ ఎంపీలపై మండిపడ్డారు. ‘మోడీ రావడం వల్ల ఏమవుతుంది? ఆయన ఏమైనా పరమాత్ముడా? ఆయన భగవంతుడేమీ కాదు’’ అని ఖర్గే అన్నారు. ఈ గందరగోళం నడుమ రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అంతకుముందు అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సభలో ప్రతిష్టంభనకు కారణం మీరంటే మీరని నినాదాలు చేశారు.

Spread the love