తెలంగాణా ఏమైనా…. ఆయనా జాగీరా….: కిషన్ రెడ్డి 

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ : తెలంగాణకు వచ్చేటప్పుడు ఆయనకు చెప్పడానికి ఏమైనా తెలంగాణ…. ఆయనా జాగీరా… అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో అక్టోబర్ 3న నిర్వహించే బహిరంగ సభకు జిజి కళాశాలలో సభ స్థలాన్ని పరిశీలన చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న పాలమూరులో, అక్టోబర్ 3న నిజామాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ బహిరంగ సభ నుండే తెలంగాణ రాష్ట్రానికి 800 మెగావాట్ల విద్యుత్ ఎన్టిపిసిఎల్ ప్రాజెక్టుని వర్చువల్ గా ఇందూర్ కేంద్రం నుండి ప్రారంభించి, తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ బిజెపి పార్టీ నాయకులు, స్థానిక నాయకత్వంతో కలుపుకుని జన సమీకరణ చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎంత అవసరం ఉందని కూడా అన్నారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు బిజెపి పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మం వంటి బలహీన గా ఉన్న ప్రాంతంలో కూడా అక్కడ ప్రాంత ప్రజలలో చాలా మార్పులు వస్తున్నాయని, ఆ ప్రాంత ప్రజలు కూడా బీజేపీ కి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభ నుండి ఎన్నికలకు దిశ నిర్దేశం జరుగుతుందని, తెలంగాణ లో బీజేపీ చాలా కీలకపాత్ర పోషిస్తుందని రానున్న రోజుల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా, జాతీయ అధ్యక్షులు నడ్డ ఇతర ముఖ్యమంత్రులు విసృతంగా అన్ని అసెంబ్లీ లను తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించానున్నారని, బిజెపి ప్రచార కార్యక్రమాలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రధాని తెలంగాణకు ఏమి చేశారు… ఏమి ఇస్తున్నారు అని కేటీఆర్ గత కొన్ని గంటల ముందు అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి బదులిస్తూ తెలంగాణ ఏమైనా ఆయనా జాగీరా, కేసీఆర్ ఎవరు అడగడానికి, టిఎస్పిఎస్సి 17 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేశారని, తెలంగాణ రాష్ట్రానికి 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్లు ఇచ్చానని, కేటీఆర్, కవిత అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం నాకు లేదని, వారు అడిగి ఎజెండాలో పడబోమని, వాళ్ళు ఏమి అడుగుతారో నన్ను అడగకండి…, నేను ఏమి అడుగుతాను వాళ్ళని అడగండి సమాధానం చెప్పమనండి అని అన్నారు.  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి గవర్నర్ తిరస్కరించారు అని, గవర్నర్ చాలా మంచి నిర్ణయం చేశారని, కెసిఆర్ కు కొమ్ముకాసేవారికి, వారికి ఏజెంట్లుగా పని చేసే వారికి, వారి అడుగులకు మడుగులు ఒత్తె వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులను ఇవ్వడానికి ప్రభుత్వం లేదని, గవర్నర్ అంగీకరించారని తెలిపారు. అదే విధంగా తెలుగు సినిమాను ప్రపంచానికి తెలుగు ప్రఖ్యాతిని తెలియజేసినటువంటి డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను నామినేట్ చేయడం జరిగిందని, ఆయన మంచి రచయిత అని , అదేవిధంగా బిజెపి ప్రభుత్వం గవర్నర్ కోటాలో కవులకు, కళాకారులకు, విద్యావంతులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అన్నారు. పరిపాలన చేతకాని దద్దమ్మలకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదని, కేటీఆర్ తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు లోకి వచ్చారని, ఆయన షాడో ముఖ్యమంత్రి అని, మేము సాధారణ కార్యకర్తల నుండి పైకి వచ్చామని, మాకు కల్వకుంట్ల కుటుంబం సర్టిఫికేట్ ఇవ్వవలసిన అవసరం లేదని, మాకు ప్రజలే సర్టిఫికెట్ ఇస్తారని, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగాను ఎన్నిక కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎండల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, అర్బన్ ఇంచార్జీ దాన్పల్ సూర్య నారాయణ, నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ దినేష్ కులచారీ, బోధన్ ఇంచార్జీ వడ్డీ మోహన్ రెడ్డి,  బీజేపీ నాయకులు పోతన్కర్ లక్ష్మీ నారాయణ, పైడి రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love