అది ఆకాశం తానెక్కడా లేకుండానే
అంతటా ఉన్నాననే ఊహాసుందరి
ఇంత దూరం పిలిపించుకొని ఎందుకొచ్చావంటారు
ఇంతగా గాయపరిచి వింతగా లేపనం అద్దుతుంటారు
అవును! ఒద్దన్న వాళ్లంతా చుట్టూ మూగుతుంటారు
అవసరమైన వాళ్ళు అసలే దొరకరు
ఆ మాటకు కన్నీళ్లు ఉబికినై
వేదిక మీద ఎలా అనుకొని కాబోలు గుడ్ల చుట్టూ ఆగినై
శిఖరం పూర్తయ్యాక మాత్రమే, దేశభక్తి
ఇక పునాది గురించి రేపు ఆలోచిద్దామంటుంది
బెల్లం ఇగిరిపోయినట్టుంది
ఈగలు ఎగిరిపోతున్నాయి
ఎక్కడ చూసినా గుడులే, దేవుళ్లే
కొందరు మనుషులు కూడా ఉంటే బాగుండేది
కులపు రక్తపు బొట్టు కడదాక తాగేను
అందలం ఎక్కాలనుకున్నది అతనొక్కడే
ఆధార్ కు తప్ప దేనికి ఉపయోగం లేని వయస్సు
మనసు యవ్వనం కాళ్లు కడుక్కున్న కొబ్బరినీరు
కుక్క కరిస్తే మందుంటుంది
మతం కరిస్తే అన్ని కుక్కలను అందుకుంటుంది
ఒరేరు నా కొడకల్లారా అన్న ఆడ ఎస్‌ఐ
పురుషాహంకారాన్ని మోస్తున్న యూనిఫారం
ఫేస్ బుక్ పొదుగు వెంటనే సేపదు
లైక్ ల పాలబొట్లు నిరంతరం రాలవు
ముజే కలెక్టర్ బనాదియే మేరే దోస్త్
షాయద్, షాయర్ బన్ సక్తా సమస్త్
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183