నవతెలంగాణ – వాషింగ్టన్ : ప్రియురాలికి ఫోన్ పాస్‌వర్డ్ ఇవ్వడం కంటే సముద్రంలో దూకేయడం బెటర్ అనుకున్నాడో ప్రియుడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఏజే అనే వ్యక్తి ప్రియురాలితో కలిసి బోట్‌పై విహారానికి వెళ్లాడు. వీరి పడవను నిఘా పోలీసులు ఆపడంతో బాస్‌కు ఫోన్ చేసేందుకు ప్రియురాలు ఏజేని పాస్‌వర్డ్ అడిగింది. చెప్పడం ఇష్టం లేని అతడు నీటిలో దూకి ఒడ్డుకు వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు ఏజేని అరెస్టు చేశారు.