కొనుగోళ్లు ఎప్పుడు.?

మండలంలో మొదలైన వరి కోతలు
ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రాలు
నవ తెలంగాణ మల్హర్ రావు. మండలంలో వరి కోతలు మొదలు ప్రారంభమైయ్యాయి.కానీ ప్రభుత్వం  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.దీంతో రైతులు ధాన్యాన్ని ఎక్కడ పోయాలో తెలియక పొలాల వద్దనే పోస్తున్నారు.పొద్దంతా అరబోసిన ఒకవేళ అకాల గాలివాన బీభత్సం సృష్టిస్తే తడవకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచుతున్నారు. మండలంలో యసంగిలో 8,960 ఎకరాలు సాగు చేసినట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.మండలంలో అన్ని గ్రామాల్లో పీఏసీఎస్,డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.అయితే ఇప్పటివరకు మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు.
ఆయా శాఖల ఆధ్వర్యంలో…
మండలంలో 15 గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారబించేందుకు అధికారులు సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు ఐకేపీ ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావాలని, ఇందుకు సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడటం జరుగుతుందని ఏపీఎం కమలను ఆదేశించారు.
అకాల భయం…
మండలంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారబించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని మదనపడుతున్నారు.ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వ్యాపారులు క్వింటాలు రూ.1,790 నుంచి రూ.1,950 మధ్య కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే తాడిచెర్ల, కొయ్యిర్,నాచారం గ్రామాల్లో వరి కోతలు మొదలైయ్యాయి. డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలు రద్దు చేయాలి.దేవర్నెని రాజేశ్వర్ రావు..మంథని మార్కెట్ డైరెక్టర్  మండలంలో ఏర్పాటు చేయనున్న డిసిఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలి.పీఏసీఎస్, ఐకెపి సొసైటీల అభివృద్ధికి ప్రోత్సహించాలి.ప్రతి సంవత్సరం  డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరుతో అధిక ధాన్యం తూకం వేస్తూ నిరుపేద రైతులను నిలువునా ముంచుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రపోజల్ పంపాము…
సంతోష్…తాడిచెర్ల పిఏసిఎస్ కార్యనిర్వహణాధికారి.
తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఆధ్వర్యంలో ఈ రబీ సీజన్ 12 కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం ప్రపోజల్ పంపాము.ప్రపోజల్ వచ్చాక కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాము.
Spread the love