కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి రాగానే

 – వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ 
– ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు.
నవతెలంగాణ- మల్హర్ రావు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ తోపాటు  ఆరు గ్యారంటీలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంథని నియోజకవర్గంలో పలిమేలలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల  మాట్లాడారు పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వహయంలో నిత్యావసర సరుకుల ధరలు, ఎరువుల ధరలు పెంచి సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శిoచారు. ప్రజలను మభ్య పెడుతు పబ్బం గడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వం మాయ మాటలు నమ్మి  మళ్ళీ  మోసపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని రాష్ట్ర ఆడపడుచులు పడుతున్న బాధలను చూసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే నియోజకవర్గంలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Spread the love