నిజామాబాద్ జిల్లాకు పోలీస్ బాస్ ఎప్పుడు వస్తారు..?

– నెల రోజులుగా ఖాళీగా ఉన్న పోస్ట్ ఇంచార్జ్ తోనే పాలన

నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా ఉన్న పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు తన పదవీ బాధ్యతలు పూర్తి చేసుకుని నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఆయన స్థానంలో జిల్లాకు బస్సులు ఎప్పుడు నియమిస్తారు అని పోలీసుల్లో ప్రజల్లో ఓ చర్చగా మారింది. నెల రోజులు గడుస్తున్న పోస్ట్ ఖాళీగా ఉండడం నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో ఇన్చార్జి పాలన జరపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు పోలీస్ కమిషనర్ను నియమిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా మొదటగా శ్రీనివాసులు రెండవ స్థానంలో కోటిరెడ్డి మూడో స్థానంలో ఇంద్ర ప్రియదర్శిని నాలుగో స్థానంలో షర్మిల ఉన్నట్లు నిజాంబాద్ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి స్పీకరు సుముఖత చూపడం లేదని కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా గతంలో నిజామాబాద్ అడిషనల్ ఎస్పీగా చేసిన పద్మజా రెడ్డిని నిజామాబాద్ సిపిగా నియమిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ జూన్ 2వ తేదీన నిజామాబాద్ లో పెద్ద ఎత్తున నిజామాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సైలకు సిఐలుగా ప్రమోషన్లు ఏడుగురికి  ఉన్నాయి. జగిత్యాల్ నిర్మల్ నుంచి ఎస్సైలను నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు అదేవిధంగా నిజాంబాద్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఐలను హైదరాబాద్కు ఏడుగురిని సిఐలుగా మిగతా వారిని ఎస్సైలుగా నిజామాబాద్ క జగిత్యాల నిర్మాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పోలీసు వర్గాలు గుసగుసలు పెడుతున్నారు. జోన్ ఐ జి పి గా నిజాంబాద్ జిల్లాలో గతంలో ఎస్పీగా మోహన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పనిచేశారు. అయితే కానీ రానున్నది ఎన్నికల సమయం కాబట్టి ప్రజల్లో పోలీస్ వర్గాల్లో తమకు నచ్చిన వారిని నిజామాబాద్ జిల్లాకు పోలీస్ కమిషనర్ గా ఎవరిని పంపిస్తారో వేచి చూడాలి. కాని ఇందులో నుండి సిపిలుగా ఇంద్ర ప్రియదర్శిని షర్మిల వస్తే బాగుంటుంది అని నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ లేకపోవడంతో నెల రోజుల్లో విచ్చలవిడిగా కేసులు నమోదవుతున్నాయి వాటిని నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

Spread the love