సమ్మెలోనే  పండగ, డిమాండ్ల పరిష్కారం ఎప్పుడు?

 నవతెలంగాణ- రామారెడ్డి : అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత తొమ్మిది రోజుల నుండి సమ్మె బాటలో పట్టిన అంగన్వాడీలు, 8 వ రోజు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సమ్మెలోనే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకున్నారు. 9వ రోజు మంగళవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి, స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Spread the love