వరదల నష్ట నివారణ చర్యలు ఎక్కడ?

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
దూర ప్రయాణికులను పట్టించుకోని ప్రభుత్వం. వరద నష్టం సంభవించి వారం రోజులు దాటిన నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టకపోవడం దురదృష్టకరమని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట రెడ్డి అన్నారు. బుధవారం  మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జూలై నెల 26వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తెగిపోగా ఆ రోజు నుండి రవాణా సౌకర్యం ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది . ఆ తరువాత రోడ్లు మరమ్మత్తులు చేయడం జరిగింది ఇసుక లారీలు ఇతర వాహనాలు నడుస్తున్నా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడపకపోవడం ప్రజలు అసౌకర్యానికి గురి అవుతున్నారని 163 జాతీయ రహదారిపై నడిచే బస్సులు చత్తీస్గడ్ విశాఖపట్నం భద్రాచలం ఇతర ఇతర దూర ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రైవేట్ వాహనదారులు చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారని కావున ప్రభుత్వం వెంటనే బస్సు సౌకర్యాలను పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా గుండ్ల వాగు ప్రాజెక్టు నుండి మొదలుకొని మోట్ల గూడెం వరకు 300కు పైగా ఎకరాల్లో ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి భూములు పనికిరాకుండా పోయాయని అన్నారు. వరదల వల్ల భూముల హద్దులు చెరిగిపోయి ఎవరి భూమి ఎక్కడ వరకు ఉందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పట్లో ఈ భూములు వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాకుండా పోయినందున ప్రభుత్వం సర్వే చేసి లెవెల్ చేసి ఇవ్వాలని లేనియెడల ఎగరానికి 50వేల రూపాయలు లెవెల్ చేసుకునే ఖర్చుల నిమిత్తం రైతులకు అందించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో పొదిల చిట్టిబాబు తీగల ఆగి రెడ్డి గుంది రాజేష్ ఖతం సూర్యనారాయణ, మద్యం మోహన్ రెడ్డి, అంబాల మురళి, గాజుల బిక్షపతి, రమేషు, యానాల, ధర్మారెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love