నవతెలంగాణ – :హైదరాబాద్: రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉ.10.28 గంటలకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు రేవంత్ మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. విమానాశ్రయంలో ప్రభుత్వ వాహనాలతో అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ అధికారులు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.