ఓట‌రు నాడి ఎటు

Where is the heart of the voter?– కీలకంగా దళిత ఓట్లు.. బీజేపీకి ఎదురుగాలి..
– దశాబ్ద పాలనలో అణగారిన సామాన్య జనం
– ఇండియా వైపు మొగ్గుచూపుతున్న యువతరం..
– మార్పు తెచ్చేవారి కోసం ఆశగా ఎదురుచూపులు
దేశంలో అతి పెద్ద ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌ (యూపీ)లో నిర్వహించనున్న ఏడవ దశ కీలకంగా మారనుంది. ఇటు ఎన్డీఏ, అటు ఇండియా బ్లాక్‌ ల మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. ఇంతకీ ఓటరు నాడి ఎటు అన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఘోసీ, బల్లియా (ఉత్తరప్రదేశ్‌) : సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాహుల్‌ గాంధీ నేతత్వంలోని ఇండియా బ్లాక్‌కు అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరూ వరుసగా కన్నౌజ్‌, రారు బరేలీ నుంచి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. గతంలో 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ గెలుపొంది ప్రత్యర్థులకు నిరాశనే మిగిల్చింది. అయితే ఈసారి సీన్‌ అలా కనిపించటంలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యూపీలోని యువకులు ఇప్పటిదాకా బీజేపీ వల్లించిన హిందూత్వం,  ఉద్యోగావకాశాల భరోసా వంటి ఆశలకు ఆకర్షితులయ్యారు. కానీ అనతికాలంలోనే కాషాయపార్టీ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయైనట్టు నిరుద్యోగయువత గుర్తించింది. ప్రతిపక్షాలు బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు, వారి గొంతును బలంగా వినిపించి వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టగలిగితేనే, ఈసారి కమలానికి తక్కువ  సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది దళితుల్లో ఎక్కువ మంది ఇండియా బ్లాక్‌కు మద్దతునిస్తేనే సాధ్యమవుతుందనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది.
యూపీలో దళిత ఓట్లు
2014లో బీఎస్పీ తన ప్రాబల్యాన్ని పోగొట్టుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో, 12.88 ఓట్లతో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు సాధించింది. ఈ సమయంలో కూటమితో బీఎస్పీకి పొత్తు కుదరలేదు. అయితే బీఎస్పీ అవసరాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఈ సారి మార్పు కోసం దళిత ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా ముఖ్యం. పెట్టుకోలేను. ఇందుకేనా బీజేపీకి పదేండ్లు అధికారం ఇచ్చింది? ప్రస్తుతం కాంగ్రెస్‌ మీద పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్‌తో పాటు ఎవరు ఉన్నా, వారిమీద కూడా ఎటువంటి సందేహం లేదు” అని చెప్పాడు.
లీకులతో పరీక్షలు రద్దు.. ఇప్పటికీ నిర్వహించలే
జౌన్‌పూర్‌కు చెందిన డిప్లొమా చేసిన దీపక్‌ కుమార్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరయ్యారు. ఆ పేపర్‌ లీకవ్వడంతో పరీక్షలు రద్దయ్యాయి. 7-8 నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం యోగి చెప్పినప్పటికీ, అది జరిగేలా లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. మన దేశంలో మహిళలు మహంతులు, ముల్లాలు కాలేరు కానీ ప్రధానిగా, రాష్ట్రపతి, సీఎంగా ఎదగగలరు. అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. మన దేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన సమానత్వపు హక్కు మాత్రమే ఆ పని చేయగలదు. మరేదీ చేయలేదు. దళిత సమాజం ఏ పురోగతి సాధించినా అది విద్య, ఉద్యోగాల వల్లనే. అయితే ఇప్పుడు అవి తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి..
బలియాలో దళితుల గోస..
బలియా జిల్లాలోని ఒక పెద్ద దళిత గ్రామంలో 80-90 దళిత గహాలు ఉన్నాయి. అక్కడ డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ పెద్ద విగ్రహం ఉంది. ఇది ప్రత్యేకమైనది కూడా. విగ్రహం దగ్గరకు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్లాలనే నిబంధన వుంది. ఇక్కడ ప్రతిరోజూ యువకులు, వద్ధులు కూర్చుని రాజకీయాల్లో వస్తున్న మార్పులతో పాటు యువకుల జీవితాలను దెబ్బతీసిన ఉద్యోగావకాశాలు, పేపర్‌ లీకేజీలు, ప్రయివేటీకరణ గురించి చర్చించుకుంటూ ఉంటారు. భవిష్యత్‌ రాజకీయాలను ప్రస్తావిస్తారు.
వన్‌మ్యాన్‌ షో వద్దు.. నిశ్శబ్ద విప్లవం చూపుతాం
గ్రామంలోని యువకులందరూ ఈసారి ఒకే వ్యక్తి పాలనను వదిలించుకోవడానికి గట్టిగానే నిర్ణయించుకున్నారు. ఇది కేవలం వారి కుల ప్రాతిపదికన కాదు, సమాజ్‌వాదీ పార్టీ కోసం కాదు. భవిష్యత్‌ తరాల పురోగతిని అణచివేస్తుందనే ఆలచనతో మార్పుకు పూనుకుంటున్నారు. అయితే ”నిశ్శబ్ద విప్లవం” అని పిలిచే దళితుల్లోనూ సామాజిక పరిస్థితుల గురించి సందేహాలున్నాయి. ఓటరు మదిలో ఏమున్నది, వాళ్లు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో! జూన్‌ 1న పోలింగ్‌లో తమ ఓటు ద్వారా తేల్చనున్నారు. అంతిమంగా ఫలితాలు వచ్చేదాక ఓపిక పట్టాల్సిందే!
భిన్నాభిప్రాయాలతో ప్రజలు..
ఘోసి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు ఓటర్లు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని వారు నిరసిస్తున్నారు. మాల్తీదేవి అనే మహిళ, ఆమె భర్త ఇద్దరూ పకోడీలు, టీ అమ్ముతుంటారు. ఎన్నికల విషయంపై ఆమెతో సంభాషించినపుడు బీజేపీ పాలనా తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ” దేశాన్ని ఏలడానికి అతనొక్కడే(మోడీ)నా? పిల్లలకు ఉద్యోగాలు లేవు, వేరే బతుకుదెరువు అవకాశాలు లేవు. ఇవన్నీ అంతం కావాలంటే మార్పు తీసుకువచ్చే దిశగా ఆలోచించాలి” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాల్తీదేవి దుకాణం వద్దకు వస్తుంటారు. వారిలో శివ్‌ప్రతాప్‌ మాట్లాడుతూ… ”కోవిడ్‌ సమయంలో నా జీవితం మారిపోయింది. ఢిల్లీలో నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతపడింది. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక కూడా ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. అప్పటి నుంచి ఖాళీగా కూర్చోవడం తప్ప చేయడానికి పనేం లేదు. ఇలాగే కొనసాగితే నా పిల్లలకు మున్ముందు తిండి కూడా

Spread the love