టీచర్ల కొరత ఉన్నచోట.. విద్యా వాలంటీర్లు: సీఎం చంద్రబాబు

Babuనవతెలంగాణ – అమరావతి: పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోండి. పాఠశాలల్లో విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలి. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితి రావాలి’ అని సూచించారు.‘మొదట అందరూ పాఠశాలకు రావడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రభుత్వ బడులకు తీసుకురావడం ఎలా అనేది ఆలోచించొచ్చు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఎక్కడో చోట బడిలో ఉండాలి. గుత్తేదారు ఏకరూప దుస్తులను సరఫరా చేయలేకపోతే ఆ పరిమాణాన్ని మిగతా గుత్తేదార్లకు సమానంగా పంచాలి. ఆలస్యం కాకుండా చూడాలి. విద్యార్థులకు శాశ్వత అకడమిక్‌ నంబరు(ఏపీఏఏఆర్‌) ఇచ్చేలా చూడాలి’ అని తెలిపారు.

Spread the love