దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘ఆకాశం దాటి వస్తావా’. కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శశి కుమార్ ముతులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ‘ఉన్నానో లేనో..’ అనే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన అద్బుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. హీరో హీరోయిన్ల మధ్య కనిపిస్తోన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ.. మ్యాజికల్ సాంగ్‌కి తగినట్లు వారిద్దరూ డాన్స్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరీ. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అని చిత్ర యూనిట్ తెలిపింది.